చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. గిల్ (32), బట్లర్ (25), సుదర్శన్(19*), హోల్డర్(23*) రాణించారు. దీంతో GT నిర్ణీత 20 ఓవర్లలో 205/3 పరుగులు చేసింది. RCB బౌలర్లలో భువనేశ్వర్, హెజెల్‌వుడ్, సుయాష్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. RCB టార్గెట్: 206.
చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు నమోదయ్యాయి. కాగా, సాయి సుదర్శన్‌కు IPLలో ఇది మూడో సెంచరీ.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. 10 ఓవర్లు ముగిసేసరికి GT వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (78*), గిల్ (22*) క్రీజులో ఉన్నారు.
RCBతో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి గిల్ (17) మంచి సహకారం అందిస్తున్నాడు. దీంతో 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన సుదర్శన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడం GT జట్టుకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.
గుజరాత్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా బట్లర్ టీ20 క్రికెట్‌లో 500 మ్యాచుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అలెక్స్ హేల్స్ (528 మ్యాచ్‌లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గుడ్ న్యూస్ చెప్పాడు. రేపు RRతో జరగబోయే మ్యాచ్‌లో తాను బరిలోకి దిగబోతున్నట్లు కమిన్స్ స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను SMలో పంచుకున్నాడు. దీనిపై SRH ఫ్రాంచైజీ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ‘వస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో కమిన్స్ ఫొటోను షేర్ చేసింది.
T20ల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ వల్ల మేలే జరుగుతుందని పంజాబ్ కింగ్స్ పేసర్ గ్జేవియర్ బార్ట్‌లెట్ అభిప్రాయపడ్డాడు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అతడు కోచ్, కెప్టెన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ అయ్యర్ ఆటగాళ్లపై ఎప్పుడూ ఒత్తిడిని దరిచేరనీయడని తెలిపాడు. కోచ్ పాంటింగ్ – అయ్యర్ కాంబోలో తాము అద్భుత ప్రదర్శన చేస్తున్నామని పేర్కొన్నాడు.
CSK జట్టుపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో చెన్నై గెలిచిన 3 విజయాల్లో రెండు సంజూ శాంసన్ సెంచరీలు చేయడంతోనే గెలిచారని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇలా కేవలం ఒక్క ప్లేయర్‌పైనే ఆధారపడితే CSK ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమని అన్నాడు. ఒకవేళ సంజూ విఫలమైతే జట్టు మళ్లీ ఓటముల బాట పడుతుందని జోస్యం చెప్పాడు. ప్లేయర్లు అందరూ సమిష్టి ప్రదర్శన చేయాలని సూచించాడు.
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ దిగ్గజం సూజీ బేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరగనున్న T20 WC తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు ఆమె ప్రకటించింది. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 181 వన్డేలు ఆడిన బేట్స్ 5,964 పరుగులు చేసింది. అలాగే, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా (4,717 పరుగులు) బేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్‌కు సూచించాడు. ‘అజిత్.. తర్వాతి సిరీస్‌లోనే వైభవ్ ఆడాలి. నిజానికి అతడు టీ20 ప్రపంచకప్ జట్టులోనే ఉండాల్సింది. బుమ్రా వంటి బౌలర్లనైనా అలవోకగా ఎదుర్కోగల సత్తా ఆ కుర్రాడికి ఉంది’ అని వ్యాఖ్యానించాడు.
IPL 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఢిల్లీపై సంజూ శాంసన్ (115*), పంజాబ్‌పై క్వింటన్ డికాక్ (112*), ఢిల్లీపై అభిషేక్ శర్మ (135*), గుజరాత్‌పై తిలక్ వర్మ (101*) సెంచరీలు సాధించగా.. నిన్న ముంబైపై సంజూ శాంసన్ (101*) మరో అద్భుత సెంచరీ బాదాడు. విశేషమేమిటంటే, ఈ సీజన్‌లో సెంచరీ చేసిన బ్యాటర్లంతా నాటౌట్‌గా నిలవడం గమనార్హం.
MIతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబైపై సెంచరీ చేసిన తొలి CSK బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. అంతేకాకుండా, ఒక IPL సీజన్‌లో 2 సెంచరీలు చేసిన CSK ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇక IPLలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో KL రాహుల్(5 సెంచరీలు)తో కలిసి సంజూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
CSKతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర పరాభం పాలైంది. తాజాగా ఈ అంశంపై MI హెడ్ కోచ్ మహేలా జయవర్దనే స్పందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రాణించాడని, సీజన్ మొదటి కొన్ని మ్యాచ్‌లలో బౌలింగ్‌లో కూడా రాణించాడని గుర్తు చేశాడు. ప్రత్యర్ధులపై ప్రభావం చూపడంలో జట్టు మొత్తం వైఫల్యం చెందిందని పేర్కొన్నాడు. ప్లేయర్లంతా త్వరలోనే రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఓటములకు పాండ్యానే బాధ్యుడిని చేస్తూ, అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముంబై కెప్టెన్సీ పగ్గాలను మరోసారి ‘హిట్ మ్యాన్’కు అప్పగించాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో MI యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.