• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPLలో ఒకే రోజు రెండు రికార్డ్ ఛేజింగ్స్

IPL 2026: శనివారం జరిగిన 2 మ్యాచుల్లోనూ రికార్డ్ ఛేజింగ్స్ నమోదయ్యాయి. తొలుత ఢిల్లీపై పంజాబ్ 265 రన్స్ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇది IPL చరిత్రలోనే అత్యధిక ఛేదన. మరో మ్యాచులో రాజస్థాన్‌పై హైదరాబాద్ 229 రన్స్ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. IPLలో ఇది 4వ అత్యధిక ఛేజింగ్. KKRపై పంజాబ్ 262, PBKSపై SRH 246 పరుగుల ఛేదన 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

April 26, 2026 / 12:20 AM IST

BREAKING: రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం

IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. హైదరాబాద్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 57, ఇషాన్ 74, NKR 36 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బ్రిజేష్ చెరో 2, ఫెరీరా ఓ వికెట్ తీశారు. అంతకుముందు రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్(103) సెంచరీతో రాణించాడు.

April 25, 2026 / 11:27 PM IST

ముగిసిన భారత్ ఆట.. SA టార్గెట్ ఎంతంటే?

5 T20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో నాల్గో మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 43, దీప్తీశర్మ 36*, రీచా ఘోష్ 34* పరుగులతో పర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎలిజ్‌మరి, కైలా చెరో 2, సెకుకునే ఓ వికెట్ తీసింది. తొలి 3 T20లూ గెలిచి ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ విజయ లక్ష్యం 186 రన్స్.

April 25, 2026 / 11:09 PM IST

పవర్ ప్లేలో SRH స్కోర్ ఎంతంటే..?

IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ ఓ వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్(34), ఇషాన్(35) ఉండగా.. అంతకుముందు హెడ్ 6 పరుగులకే వెనుదిరిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 228/6 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయం కోసం SRH మిగిలిన 84 బంతుల్లో 140 రన్స్ చేయాల్సి ఉంది.

April 25, 2026 / 10:22 PM IST

IPL: ఒకే రోజు ఇద్దరు చేతులు మారిన ఆరెంజ్ క్యాప్

RR సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. SRHతో మ్యాచ్‌లో 103 పరుగులు చేసిన వైభవ్, ఈ సీజన్‌లో మొత్తంగా 357 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో రాహుల్(357)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ముందుగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాహుల్ 152* పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోగా, కొద్ది గంటల్లోనే వైభవ్ దానిని దక్కించుకోవడం విశేషం.

April 25, 2026 / 09:44 PM IST

BREAKING: SRH టార్గెట్ ఎంతంటే?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(103) సూపర్ సెంచరీతో అదరగొట్టగా.. ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫెరీరా 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. SRH బౌలర్లలో మలింగ 2 వికెట్లు తీయగా.. కమ్మిన్స్, ప్రఫుల్, హుస్సేన్, నితీష్ తలో వికెట్ పడగొట్టారు.

April 25, 2026 / 09:30 PM IST

15 ఏళ్లకే టీ20ల్లో 1000 పరుగులు

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (103) అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాకుండా, అతి పిన్న వయసులో (15 ఏళ్ల 29 రోజులు) ఈ రికార్డును అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.

April 25, 2026 / 09:06 PM IST

ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు

➣క్రిస్ గేల్ (RCB) – 30 బంతుల్లో VS PWI, 2013➣వైభవ్ సూర్యవంశీ (RR) – 35b VS GT, 2025➣వైభవ్ సూర్యవంశీ (RR) – 36b VS SRH, 2026*➣యూసుఫ్ పఠాన్ (RR) – 37b VS MI, 2010➣హెన్రిచ్ క్లాసెన్ (SRH) – 37b VS KKR, 2025➣డేవిడ్ మిల్లర్ (PBKS) – 38b VS RCB, 2013

April 25, 2026 / 08:57 PM IST

BREAKING: 36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కేవలం 36 బంతుల్లోనే IPLలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా ప్రఫుల్ హింగే వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వరుసగా 4 సిక్సర్లు కొట్టడం గమనార్హం.

April 25, 2026 / 08:50 PM IST

RR Vs SRH: భారీ స్కోరు దిశగా రాజస్థాన్

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో RR భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. కేవలం 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ (10) తక్కువ పరుగులకే నిష్క్రమించినప్పటికీ, సూర్యవంశీ (77*), ధ్రువ్ జురెల్ (38*) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే రాజస్థాన్ 250 పరుగుల మార్క్‌ను కూడా సులభంగా అందుకునేలా కనిపిస్తోంది.

April 25, 2026 / 08:36 PM IST

IPL: ఢిల్లీ VS పంజాబ్.. 529 పరుగులు

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఢిల్లీ 264 పరుగులు చేయగా, పంజాబ్ 265 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ రెండు జట్లు కలిసి మొత్తం 529 పరుగులు నమోదు చేశాయి. దీంతో IPL చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో 549 పరుగులతో SRH (287) Vs RCB (262) మ్యాచ్ ఉంది.

April 25, 2026 / 08:31 PM IST

వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విజృంభిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసారికి రాజస్థాన్ ఒక్క వికెట్ కోల్పోయి 76 పరుగులు చేసింది.

April 25, 2026 / 08:05 PM IST

BREAKING: పంజాబ్ కింగ్స్ సంచలన విజయం

ఢిల్లీపై పంజాబ్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రభుసిమ్రాన్(76), ప్రియాంష్(43) తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 126 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరు ఔటైన అనంతరం వధేరా(25), శశాంక్(19*)తో కలిసి శ్రేయస్(71*) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. IPL చరిత్రలో ఇదే అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్.

April 25, 2026 / 07:47 PM IST

RR vs SRH: తుది జట్లు ఇవే

SRH: అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అరోరా, అనికేత్, నితీష్, కమిన్స్ (c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే. IMPACT: స్మరన్, హెడ్, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్.RR: జైస్వాల్, సూర్యవంశీ, జురెల్ (WK), పరాగ్ (c), హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, దేశ్‌పాండే, బర్గర్, బ్రిజేష్. IMPACT: బిష్ణోయ్, ప్రిటోరియస్, రవి, సందీప్ శర్మ, శుభమ్.

April 25, 2026 / 07:08 PM IST

BREAKING: కమిన్స్ వచ్చాడు.. టాస్ గెలిచాడు

జైపూర్ వేదికగా RR, SRH జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో SRH రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు. కమిన్స్ రాకతో, ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ కేవలం బ్యాటర్‌గానే ఆడబోతున్నాడు. ఈ సీజన్‌లో SRH టాస్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

April 25, 2026 / 07:00 PM IST