• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

PBKS Vs RR: తుది జట్లు ఇవే

RR: సూర్యవంశీ, జైస్వాల్, జురెల్ (WK), పరాగ్ (c), ఫెరీరా, జడేజా, షనక, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, యశ్ పుంజా. IMPACT: హెట్మెయర్, శుభమ్, తుషార్, బిష్ణోయ్, రవిPBKS: ప్రియాంష్, ప్రభ్‌సిమ్రాన్(WK), కొన్నోలీ, అయ్యర్ (c), సూర్యాంశ్, వధేరా, స్టోయినిస్, యాన్‌సన్, ఫెర్గూసన్, అర్ష్‌దీప్, చాహల్. IMPACT: ముషీర్ అహ్మద్, విష్ణు, వైషాక్, బార్ట్‌లెట్, హర్‌ప్రీత్

April 28, 2026 / 07:08 PM IST

ఐపీఎల్ చరిత్రలో RCB అరుదైన రికార్డు

ఐపీఎల్ చరిత్రలో RCB జట్టు అరుదైన రికార్డును నెలకొల్పింది. ఢిల్లీతో మ్యాచ్‌లో 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన RCB.. ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తద్వారా IPL చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా విజయం సాధించిన జట్ల జాబితాలో RCB రెండో స్థానానికి చేరింది. కాగా, ఈ జాబితాలో MI అగ్రస్థానంలో ఉంది. 2008లో KKRపై 87 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

April 28, 2026 / 05:31 PM IST

‘బాహుబలి 2’కు 9 ఏళ్లు

‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఐకానిక్ మూవీ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం SMలో ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో అభిమానులు అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

April 28, 2026 / 05:02 PM IST

IPL: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్క్, రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి పోరులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్వయంగా ధృవీకరించాడు. స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

April 28, 2026 / 04:57 PM IST

PBKS Vs RR: హెడ్ టు హెడ్ రికార్డులు

పంజాబ్, రాజస్థాన్ మధ్య IPLలో ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో RR 17 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా, తలో విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. అగ్రస్థానంలో PBKS ఉండగా, రాజస్థాన్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

April 28, 2026 / 04:02 PM IST

‘నా పని అయిపోయిందని.. ఎగతాళి చేశారు’

శ్రేయస్ అయ్యర్ తను ఎదుర్కొన్న విమర్శల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా పని అయిపోయిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు నా టెక్నిక్ సరిపోదని ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలే నన్ను మరింత బలంగా పుంజుకునేలా చేశాయి. నేను ఎవరికీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మాటలతో కాకుండా, నా బ్యాట్‌తోనే ప్రతి విమర్శకుడి నోరు మూయిస్తా. నా ఆట తీరే నేను ఎవరో నిరూపిస్తుంది’ అని పేర్కొన్నాడు.

April 28, 2026 / 03:42 PM IST

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: DC ఓనర్

RCB నిన్న జరిగిన మ్యాచ్‌లో DC ఎదుర్కొన్న ఘోర ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జట్టుపై నమ్మకాన్ని కోల్పోకూడదని, గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీ కేవలం 75 పరుగులకే కుప్పకూలగా.. RCB 6.3 ఓవర్లలోనే విజయం సాధించింది.

April 28, 2026 / 03:02 PM IST

క్రికెట్ ఫ్యాన్స్‌కు పీసీబీ చీఫ్ గుడ్‌న్యూస్

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు PCB చీఫ్ మెహ్సిన్ నఖ్వీ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్లే ఆఫ్స్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, జాతీయ పొదుపు చర్యలకు అనుగుణంగా మ్యాచులకు హాజరయ్యేటప్పుడు ఫ్యాన్స్ ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు.

April 28, 2026 / 02:40 PM IST

IPL: షెఫర్డ్‌ను అందుకే ఆడిస్తున్నారా?

IPL-2026 సీజన్‌లో RCB ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ అతడు విఫలమవుతున్నాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో 39 పరుగులు, బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో, అతడిని కేవలం అదృష్టం కోసమే తుది జట్టులో కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

April 28, 2026 / 02:24 PM IST

నా రీఎంట్రీని అడ్డుకుంటున్నారు: వినేశ్ ఫొగాట్

రిటైర్మెంట్‌ను పక్కన పెట్టిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. 2028 ఒలింపిక్స్‌లో పోటీపడతానని ప్రకటించింది. ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 30. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. గడువు ముగిసిందని MSG వస్తోంది. దీనిపై WFIలోని పాలనా యంత్రాంగాన్ని సంప్రదిస్తే స్పందించడం లేదు’ అని పేర్కొంది.

April 28, 2026 / 01:20 PM IST

కేదార్‌నాథ్‌లో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ క్షేత్రం ఈనెల 22న తెరుచుకుంది. ఆలయ పరిసరాలన్నీ శివనామాస్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడి దర్శనానికి భక్తులంతా భక్తిశ్రద్ధలతో ఆలయం వద్దకు తరలొస్తున్నారు. ఇవాళ భార‌త మ‌హిళా క్రికెట‌ర్ స్నేహ్ రాణా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సంద‌ర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసింది.

April 28, 2026 / 12:58 PM IST

ముంబై ఇండియ‌న్స్‌కు శాంట్నర్ దూరం

IPL 2026లో ముంబై ఇండియన్స్‌కు కలిసి రావడం లేదు. ఆ జట్టు వరుసగా పరాజయాల పాలవుతోంది. తాజాగా ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచులకు దూరమైనట్లు MI ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడిని రూ.75 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌కే తీసుకున్నారు.

April 28, 2026 / 11:03 AM IST

BWF కౌన్సిల్‌లో పీవీ సింధుకు కీలక పదవి

భారత బ్యాడ్మింటన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె ఇప్పుడు కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రపంచ స్థాయి నిర్ణయాధికార కమిటీలో ఓటుహక్కు కలిగిన సభ్యురాలిగా ఎంపికవడం విశేషం. సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.

April 28, 2026 / 10:22 AM IST

IPL చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు

IPL చరిత్రలో కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టోర్నీ చరిత్రలోనే 9000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు. 275 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ మార్క్ అందుకున్నాడు. ఇందులో 66 హాఫ్ సెంచరీలు ఉండగా, ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

April 28, 2026 / 05:35 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒలింపియన్‌పై వేటు

మహిళా రోయింగ్ కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఓ ఒలింపియన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆసియా గేమ్స్ పతక విజేత రోయర్ పీటీ పౌలోస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు జనవరిలో మహిళా అసిస్టెంట్ రోయింగ్ కోచ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం పీటీ పౌలోస్‌ను శాయ్ సస్పెండ్ చేసింది.

April 28, 2026 / 01:59 AM IST