భారత బ్యాడ్మింటన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్పర్సన్గా ఎన్నికైన ఆమె ఇప్పుడు కౌన్సిల్లో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రపంచ స్థాయి నిర్ణయాధికార కమిటీలో ఓటుహక్కు కలిగిన సభ్యురాలిగా ఎంపికవడం విశేషం. సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.