ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రం ఈనెల 22న తెరుచుకుంది. ఆలయ పరిసరాలన్నీ శివనామాస్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడి దర్శనానికి భక్తులంతా భక్తిశ్రద్ధలతో ఆలయం వద్దకు తరలొస్తున్నారు. ఇవాళ భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.