IPL 2026లో ముంబై ఇండియన్స్‌కు కలిసి రావడం లేదు. ఆ జట్టు వరుసగా పరాజయాల పాలవుతోంది. తాజాగా ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచులకు దూరమైనట్లు MI ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడిని రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌కే తీసుకున్నారు.