ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి మ్యాచ్‌తో ఒక కొత్త ఆటగాడు టాప్ ఆర్డర్‌లోకి వస్తున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ(440 రన్స్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేఎల్ రాహుల్(433 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్(425పరుగులు), వైభవ్ సూర్యవంశీ(404 పరుగులు), సాయి సుదర్శన్(385 పరుగులు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో పరాజయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘మేము శుభారంభం అందుకున్నప్పటికీ దానిని కొనసాగించలేకపోయాము. కనీసం 180-200 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. నాలుగో ఓవర్‌లో నేను ఏకంగా 27 పరుగులు ఇవ్వడం మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. చిన్న చిన్న తప్పిదాలే తీవ్ర ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు.
IPLలో వరుస విజయాలతో దూసుకెళ్లిన టాప్-4 జట్లు (PBKS, RCB, SRH, RR) గత నాలుగు రోజులుగా తడబడుతున్నాయి. ఏప్రిల్ 30న RCB, మే 1న RR, మే 3న హైదరాబాద్, పంజాబ్ జట్లు ఓటమి పాలయ్యాయి. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మార్పులు లేకపోయినా.. GT, KKR, CSK, DC జట్లు పుంజుకుంటే సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
IPL -2026లో ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన చేస్తోంది. MI ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వెనక హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఉందని కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. హార్దిక్ ఓ ప్లాస్టిక్ కెప్టెన్ అని.. అతని చెత్త నిర్ణయాల కారణంగా MI ఈ పరిస్థితిలో ఉందని విమర్శలు చేశారు. అతనికి కెప్టెన్సీ పనికిరాదని విమర్శించారు. రోహిత్ శర్మను వెంటనే జట్టులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
➤ 1777: జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్ జననం➤ 1870: సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం ➤ 1910: మహాకవి శ్రీశ్రీ జననం➤ 1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం ➤ 1986: భారతీయ నౌకాదళంలో చేరిన INS సింధుఘోష్➤ 1987: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ జననం➤ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంఆయుష్మాన్ భారత్ దివస్
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం వైభవ్‌పై యశస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. వైభవ్ నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్ని చూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని SRH 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్ (76), క్లాసెన్ (65*) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అభిషేక్ శర్మ (45), సలీల్ అరోరా (30*) పరుగులు చేశారు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్లాసెన్ (42*), నితీష్ కుమార్ రెడ్డి (14*) ఉన్నారు. హైదరాబాద్ విజయానికి 36 బంతుల్లో 55 పరుగులు అవసరం.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఘజన్ ఫర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (45) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ (0) గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. SRH విజయానికి 66 బంతులకు 114 పరుగులు అవసరం.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (36), ట్రావిస్ హెడ్ (48) పరుగులతో క్రీజులో ఉన్నారు. SRH విజయానికి 84 బంతుల్లో 152 పరుగులు అవసరం.
SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో MI బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (123*) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడికి తోడుగా విల్ జాక్స్ (46), పాండ్యా (31), నమన్ ధీర్ (22) రాణించారు. దీంతో ముంబై 20 ఓవర్లలో 243/5 పరుగులు చేసింది. సూర్యకుమార్(5) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. SRH బౌలర్లలో హింగే 2, మలింగ, సాకిబ్ హుస్సేన్, నితీష్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.
TG: తెలంగాణ టీ20 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లీగ్ ద్వారా టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డాడు. టోర్నీ చాలా మంచి ఐడియా అని అన్నాడు. 94 ఏళ్ల నుంచి HCA సేవలు అందిస్తుందన్నాడు. లోకల్ ప్లేయర్లను ఐపీఎల్ టీమ్‌లోకి తీసుకోవాలని SRH టీమ్‌ను కోరుతున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్‌లో భాగంగా రేపు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న RCB, ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. మరోవైపు GT తమ సొంతగడ్డపై RCBని చిత్తు చేసి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికల్టన్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై తరఫున డికాక్ సెంచరీ చేయగా, ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికల్టన్ నిలిచాడు. మొత్తంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది 9వ సెంచరీ.
HCA ఆధ్వర్యంలో తెలంగాణ T20 లీగ్‌ను నిర్వహించబోతున్నారు. పార్క్ హయత్ వేదికగా జరిగిన కార్యక్రమంలో జస్టిస్ నవీన్ రావు, క్రికెటర్ అంబటి రాయుడు, డీజీపీ సీవీ ఆనంద్ కలిసి ఈ లీగ్ లోగోను ఆవిష్కరించారు. జూన్, జూలై నెలల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా IPL తరహాలో జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్‌లు పాల్గొనబోతున్నాయి. ఈ జట్లను దక్కించుకోవడం కోసం 40 ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.