ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ LSGపై 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి మెరిశాడు. ఈ క్రమంలో రోహిత్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రోహిత్.. మునపటి ‘హిట్ మ్యాన్’ను గుర్తుచేశాడని అన్నాడు. రోహిత్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే.. ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలకు గండిపడటం ఖాయమని హెచ్చరించాడు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోయ్నా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన.. TMC అభ్యర్థిపై 14,000 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించాడు. 2021 ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. కాగా, దిండా భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడి మొత్తం 29 వికెట్లు పడగొట్టారు.
IPL 2026లో LSG కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 204 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంత్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో LSG కోచ్ జస్టిన్ లాంగర్ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ అనేది చాలా కఠినమైదని, ఎంతో ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. అతడు కఠోరంగా శ్రమిస్తున్నాడని.. ఫామ్‌లోకి వస్తాడని అన్నాడు.
ఇటీవల హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహీకాతో కలిసి చేస్తున్న హంగామాపై అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. IPL 2026లో యశస్వి జైస్వాల్, ఇషాన్, అర్ష్‌దీప్ సైతం తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను మైదానాల్లోకి తీసుకొస్తున్నారు. దీనిపై BCCI సీరియస్ అవుతున్నట్లు సమాచారం. క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేయొచ్చని.. గర్ల్‌ఫ్రెండ్స్ విషయంలో షరతులు విధించొచ్చని తెలుస్తోంది.
IPL 2026లో భాగంగా ముంబై జరిగిన మ్యాచ్‌లో LSG ఓటమిపాలైంది. ఈ పోరులో ఓటమికి గల కారణాలపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. మంచి ఆరంభం లభించానా.. చివరకు 10-15 పరుగులు తక్కువగా చేసినట్లు తెలిపాడు. ‘ఈ పిచ్‌పై 220-230 పరుగులు ఈజీగా చేయొచ్చు. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. వారిని నిందించలేం. మా జట్టుకు కాస్త అదృష్టం కూడా తోడు కావాలి’ అని చెప్పుకొచ్చాడు.
IPL 2026లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్క గాయంతో బాధపడుతున్న అతడు చెన్నై జట్టుతో పాటే ఉంటున్నాడు. అయితే, ఇవాళ ఢిల్లీతో మ్యాచ్ కోసం ధోనీ జట్టుతో పాటు వెళ్లలేదు. దీంతో అతడు IPL 2026కు పూర్తిగా దూరమైనట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ధోనీ ప్రస్తుతం తమతో లేడని, జట్టుతో పాటు ఢిల్లీకి రాలేదని CSK బౌలింగ్ సలహాదారు సిమన్స్ వెల్లడించాడు.
ఇవాళ్టి నుంచి ప్రపంచకప్ స్టేజ్-2 ఆర్చరీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జపాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ టోర్నీలో భారత్ బరిలో దిగుతుంది. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం.. విదేశీ కోచ్ అందుబాటులో లేని కారణంగా ఈ పోటీల్లో భారత్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది.
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్‌లు ఆడి, నాలుగేసి విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ రేస్‌లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 228/5 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని MI 18.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ(84), రికల్టన్(83) MI గెలుపును శాసించారు. నమన్(23), సూర్య(12) రన్స్ చేశారు.
IPLతో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 27 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్ రోహిత్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 228/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ పూరన్ (63) కేవలం 21 బంతుల్లోనే 8 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, మార్ష్ (44), హిమ్మత్ సింగ్ (40), మార్‌క్రమ్ (31) రాణించారు. కెప్టెన్ పంత్ (15) మరోసారి విఫలమయ్యాడు. MI బౌలర్లలో కార్బిన్ బోష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్, జాక్స్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన TVK అధినేత, నటుడు విజయ్‌కు టీమిండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి అభినందనలు తెలిపాడు. గతంలో విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘అన్నా గెలిచాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన వరుణ్.. తాను విజయ్‌కి వీరాభిమానిని అని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశాడు.
MIతో మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక (5 సార్లు) అర్ధశతకాలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ క్రమంలో RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(4 సార్లు)ని వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో 6 సార్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఐపీఎల్‌లో భాగంగా రేపు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్‌లు ఆడి, నాలుగేసి విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ రేస్‌లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న నికోలస్ పూరన్‌ను కార్బిన్ బోష్ పెవిలియన్ చేర్చాడు. 21 బంతుల్లో ఏకంగా 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన పూరన్.. కార్బిన్ బోష్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో మరో సెట్ బ్యాటర్, మార్ష్ (44)ను కూడా ఔట్ చేసి లక్నోకు డబుల్ షాక్ ఇచ్చాడు. 10 ఓవర్లలో LSG స్కోర్ 147/3.