ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన KKR vs MI మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచడంతో టాస్ పడటం ఆలస్యమైంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా, ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం తగ్గితే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ నిర్వహించే అవకాశముంది.