• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

మేం బ్యాటింగే కోరుకున్నాం: సూర్య

భారత్‌తో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను ముందుగా బ్యాటింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. ఎందుకంటే ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేయడం అంత తేలిక కాదన్నాడు. పెద్దగా మంచు ప్రభావం కూడా ఉండకపోవచ్చని చెప్పాడు. ఇది ఒక మంచి పిచ్ అని పేర్కొన్నాడు.

March 5, 2026 / 06:55 PM IST

కోహ్లీని దాటేసిన సూర్యకుమార్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారి జాబితాలో సూర్య(51 మ్యాచ్‌లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ(50) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ధోనీ(72), రోహిత్(62) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

March 5, 2026 / 06:46 PM IST

IND vs ENG: ప్లేయింగ్-11

ఈ మ్యాచ్‌లో భారత్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇంగ్లండ్ జట్టులో రెహాన్ స్థానంలో ఓవర్టన్ వచ్చాడు.IND: అభిషేక్, శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రాENG: సాల్ట్, బట్లర్(w), బ్రూక్(c), బెథెల్, బాంటన్, కుర్రాన్, జాక్స్, జామీ ఓవర్టన్, డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్

March 5, 2026 / 06:37 PM IST

BREAKING: టాస్ ఓడిన టీమిండియా

ముంబై వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. T20 WC సెమీస్‌లో ఈ జట్లు ఇప్పటివరకు 2 సార్లు తలపడ్డాయి. 2022లో ENG, 2024లో IND విజేతలుగా నిలిచాయి. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ సెమీస్‌లో గెలిచిన జట్టే విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

March 5, 2026 / 06:30 PM IST

ప్రపంచకప్‌లో విల్ జాక్స్ వన్ మ్యాన్ షో!

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రస్తుత T20 WCలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, ఒకే T20 WC ఎడిషన్‌లో అత్యధిక MOM అవార్డులు అందుకున్న షేన్ వాట్సన్ (2012లో 4 అవార్డులు) రికార్డును సమం చేశాడు.

March 5, 2026 / 04:57 PM IST

భయం లేకుండా ఆడతాం: హ్యారీ బ్రూక్

టీమిండియాతో సెమీఫైనల్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాం. ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడుతున్నాం. అయితే, ఇప్పటి వరకు మా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రాలేదు. అది ఈరోజే వస్తుందని నేను ఆశిస్తున్నాను. మైదానంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ.. టీమిండియాపై పైచేయి సాధిస్తాం’ అని పేర్కొన్నాడు.

March 5, 2026 / 04:35 PM IST

15-20 పరుగులు అదనంగా ఇస్తున్నాం: మోర్కెల్ 

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫీల్డింగ్‌పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. కొన్నిసార్లు మేం ఫీల్డింగ్‌లో అనవసరంగా 15-20 పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇస్తున్నాం. ఇది మేం ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే ఈ విభాగంపై నిరంతరం కష్టపడుతున్నాం. ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నాడు.

March 5, 2026 / 04:06 PM IST

T20 WC: సెమీస్ గెలిస్తే కప్పు మనదే..!

T20 WCలో గత 4 ఎడిషన్లుగా రెండో సెమీఫైనల్ గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తూ వస్తోంది. 2016లో WI, 2021లో AUS, 2022లో ENG, 2024లో భారత్.. ఇలా రెండో సెమీఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లే ఫైనల్లోనూ గెలిచి ట్రోఫీని ముద్దాడాయి. ప్రస్తుతం T20 WCలో IND-ENG మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఈ రికార్డులను బట్టి చూస్తే, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉంది.

March 5, 2026 / 03:58 PM IST

ఇంగ్లండ్ ఫైనల్ చేరుతుంది: పీటర్సన్

టీమిండియాతో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ‘X’ వేదికగా ట్వీట్ చేశాడు. దీనిపై భారత నెటిజన్లు.. ఇంగ్లండ్ జట్టు తమ కిట్ బ్యాగులు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్లడం ఖాయమని కౌంటర్లు ఇస్తున్నారు. భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 03:36 PM IST

IND vs ENG: ఎవరు గెలిచినా రికార్డే

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్ చేరాయి. దీంతో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్లో ఏ జట్టు గెలిచి ఫైనల్ చేరిన అది రికార్డు కానుంది. కాగా, భారత్ 2007(విజేత), 2014(రన్నరప్), 2024(విజేతా) ఫైనల్ చేరింది.

March 5, 2026 / 03:16 PM IST

టీమిండియాకు మైఖేల్ వాన్ సలహా

T20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయింగ్-11లో కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా ఆడించాలని సూచించాడు. ఇందుకోసం తిలక్ లేదా దూబెలలో ఒకరిని తప్పించాలని పేర్కొన్నాడు. కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత్ విజయావకాశాలు మెరుగవుతాయన్నాడు.

March 5, 2026 / 02:49 PM IST

ఫిన్ అలెన్‌పై సచిన్ ప్రశంసల వర్షం

సౌతాఫ్రికాతో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ స్పందిస్తూ.. ఫిన్ అలెన్ అద్భుతం చేశాడని ప్రశంసించాడు. ‘సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చునేలా చేస్తాయి.. అయితే ఫిన్ మనం సర్దుకుని కూర్చునేలోపే మ్యాచ్ పూర్తిచేశాడు’ అని పేర్కొన్నాడు.

March 5, 2026 / 02:28 PM IST

ఆమిర్ USA ప్లేయర్లకూ భయపడ్డాడు: కైఫ్

T20 WCలో టీమిండియా ఆటను పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ పదే పదే విమర్శించడంపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. USA పార్ట్ టైమ్ ప్లేయర్లను చూసి కూడా ఆమిర్ భయపడిపోయాడని, 2024 T20 WC మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ఏకంగా 18 రన్స్ ఇచ్చి పాక్ ఓడిపోయేలా చేశాడని కైఫ్ గుర్తుచేశాడు. అప్పుడు ఒత్తిడితో వైడ్లు వేసిన అతను.. వార్తల్లో నిలవడానికే ఇప్పుడు మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.

March 5, 2026 / 02:11 PM IST

అభిషేక్ ఆటపై పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

T20 WCలో రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న అభిషేక్‌పై క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేనప్పుడు నెట్ ప్రాక్టీస్ కంటే విరామం తీసుకోవడం మంచిదని.. అప్పుడే మానసికంగా బలం చేకూరుతుందని సూచించాడు. ఒత్తిడిని అధిగమించేందుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ బదులు బైలింగ్, ఫీల్డింగ్ కోసం సాధన చేయాలని.. అంతమాత్రానికే బ్యాటింగ్ స్కీల్స్ ఏటూ పోవన్నాడు.

March 5, 2026 / 01:53 PM IST

మహిళతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

T20 WC వేళ ఓ పాక్ క్రికెటర్ శ్రీలంకలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. లంకతో సూపర్-8 పోరుకు ముందు ఆ ప్లేయర్.. హౌస్ కీపింగ్ మహిళను వేధించాడు. గమనించిన తోటి సిబ్బంది ఆమెను రక్షించి.. హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం పాక్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు చెప్పగా.. ఆయన క్షమాపణలు కోరి, సదరు ఆటగాడికి భారీగా ఫైన్ విధించాడు.

March 5, 2026 / 01:32 PM IST