తన అన్న అంత్యక్రియలు ముగిసిన వెంటనే, ‘భారత్-ఆసిస్ మ్యాచ్‌కు కామెంటరీ చేస్తావా?’ అని ఓ BCCI అధికారి అడిగారని మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుణెలో కామెంటేటర్‌గా చేస్తున్న సమయంలో.. తన తల్లి మరణించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేసుకున్నాడు. బోర్డు ప్రతినిధులు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.