భారత మాజీ ప్లేయర్లు ద్రవిడ్, అశ్విన్ ఓ క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్(ETPL)లో గ్లాస్గో(స్కాట్లాండ్) బేస్డ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు ఇండియన్ కన్సార్షియంలో వారూ భాగస్వాములు అవుతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ETPLలో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ నుంచి మొత్తం 6 జట్లు తలపడనున్నాయి.