KMM: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ తెలిపారు.