క్రికెట్‌లో పలు నిబంధనలను మార్చేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టెస్టు మ్యాచ్ మధ్యలో గులాబీ బంతిని మార్చాలని, అలాగే టీ20 ఇన్నింగ్స్ బ్రేక్ సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ కీలక మార్పులపై మే 30న జరిగే ఐసీసీ సమావేశంలో చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ ఆటలో మరిన్ని మార్పులకు దారితీయనున్నాయి.
IPL 2026లో CSK పేలవ ప్రదర్శన తర్వాత కోచ్‌గా అశ్విన్‌ను వద్దంటూ ఒక అభిమాని, “అతడు యూట్యూబ్‌లోనే ప్లేయింగ్ XI చెప్తాడు” అని వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. దీనికి అశ్విన్ ఘాటుగా స్పందిస్తూ.. “అలా చేస్తే అవినీతి నిరోధక విభాగం చర్యలు తీసుకుంటుంది, ఆ రూల్స్ కూడా నీకు తెలియవు. అయినా ధోనీ ఉండగా, సీఎస్‌కే కొత్త కోచ్ కోసం ఎందుకు వెతకాలి?” అని బదులిచ్చాడు.
IPL 2026లో CSK పేలవ ప్రదర్శన తర్వాత కోచ్‌గా అశ్విన్‌ను వద్దంటూ ఒక అభిమాని.. “అతడు యూట్యూబ్‌లోనే ప్లేయింగ్ XI చెప్తాడు” అని వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. దీనికి అశ్విన్ ఘాటుగా స్పందిస్తూ.. “అలా చేస్తే అవినీతి నిరోధక విభాగం చర్యలు తీసుకుంటుంది, ఆ రూల్స్ కూడా నీకు తెలియవు. అయినా ధోనీ ఉండగా, సీఎస్‌కే కొత్త కోచ్ కోసం ఎందుకు వెతకాలి?” అని బదులిచ్చాడు.
IPL 2026లో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం తన డ్రీమ్ వికెట్ అని సన్‌రైజర్స్ యువ పేసర్ సకిబ్ హుసేన్ తెలిపాడు. తన తొలి ఓవర్‌లోనే కోహ్లీ వికెట్ తీసి సంచలనం సృష్టించిన సకిబ్.. పిచ్‌ను బట్టి స్లో బంతులు వేయాలన్న కోచ్ వరుణ్ భాయ్ సూచనలతోనే ఈ ప్రణాళిక అమలు చేశానని చెప్పాడు. ప్లేఆఫ్స్‌కు చేరిన తమ జట్టును విజేతగా నిలిపేందుకు వంద శాతం శ్రమిస్తానని సకిబ్ పేర్కొన్నాడు.
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ కోహ్లీ(15)ని SRH యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తమ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ సహకారంతోనే ఈ వికెట్ తీయగలిగానని హుస్సేన్ తెలిపాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానని, ఎందుకంటే కోహ్లీని ఔట్ చేయాలనేది తన డ్రీమ్ అని వెల్లడించాడు.
IPL-2027 సీజన్‌కు CSK హెడ్ కోచ్‌గా ఆ జట్టు స్టార్ ప్లేయర్ ధోనీ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకుంటే తదుపరి కోచ్‌గా ధోనీని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్లెమింగ్ భవిష్యత్తుపై మేనేజ్‌మెంట్ చర్చ నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సీజన్‌లో గాయం కారణంగా ధోనీ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిన్న SRHతో జరిగిన మ్యాచ్‌లో 211వ సారి 50+ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో అలెక్స్ హేల్స్ (210) రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (200), బాబర్ ఆజం (196), క్రిస్ గేల్ (191) ఉన్నారు.
IPL 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే 2016 నాటి సీన్ రిపీట్ అయినట్లు కనిపిస్తోంది. అప్పట్లో లాగే ఇప్పుడు కూడా గుజరాత్, RCB టాప్-2లో ఉండగా.. SRH 3వ స్థానంలో నిలిచింది. ముంబై, చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. 2016లో ఎలిమినేటర్ నుంచే వచ్చి సన్‌రైజర్స్ కప్ కొట్టింది. ఈసారి కూడా అదే హిస్టరీ రిపీట్ అవుతుందంటూ SRH ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
IPLలో అతి తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో RCB బ్యాటర్ రజత్ పాటిదార్(933 బంతులు) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే ఆయన క్రిస్ గేల్(943), సునీల్ నరైన్(950), శివమ్ దూబే(992)లను వెనక్కి నెట్టాడు. ఈ అరుదైన లిస్ట్‌లో ఆండ్రీ రస్సెల్ కేవలం 657 బంతులతో మొదటి స్థానంలో ఉండగా, నికోలస్ పూరన్ 884 బంతులతో రెండో స్థానంలో ఉన్నారు.
IPL 2026లో SRH బ్యాటర్లు పరుగుల వరద పారిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే IPL సీజన్‌లో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా SRH(9 సార్లు) అగ్రస్థానంలో నిలిచింది. గతంలో గుజరాత్(2025), పంజాబ్(2025) పేరిట ఉన్న 8 సార్ల రికార్డును బద్దలు కొట్టింది. ఈ సీజన్‌లో పంజాబ్, RCB కూడా 8 సార్లు 200+ స్కోర్లు సాధించాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా SRH, RCB మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన అసాధారణ ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన కిషన్‌ను ఈ అవార్డు వరించింది.
SRH లీగ్ దశను విజయంతో ముగించినా, టాప్-2 చేరాలనే కల నెరవేరలేదు. RCBపై SRH అద్భుత విజయం సాధించింది. అయితే, పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరాలంటే నెట్ రన్ రేట్ పరంగా RCBపై భారీ తేడాతో గెలవాలనే సమీకరణాన్ని SRH అందుకోలేకపోయింది. దీంతో 3వ స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేటర్ మ్యాచ్‌కు పరిమితమైంది. అక్కడ గెలిస్తేనే ఫైనల్ రేసులో నిలవడానికి క్వాలిఫైయర్-2 ఆడే అవకాశం లభిస్తుంది.
IPL 2026లో భాగంగా RCBతో జరిగిన ఉత్కంఠ పోరులో SRH 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 255 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో RCB 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. SRH విజయంలో ఇషాన్ కిషన్(79), అభిషేక్(56), క్లాసెన్(51) కీలక పాత్ర పోషించారు. SRH విజయం సాధించినప్పటికీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది.
మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 50+ పరుగుల భాగస్వామ్యాల్లో భాగమైన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 211 సార్లు 50+ పార్ట్‌నర్‌షిప్స్‌తో అలెక్స్ హేల్స్(210)ను కోహ్లీ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(200), బాబర్ అజామ్(196), క్రిస్ గేల్(191) ఉన్నారు. ఈ అరుదైన ఘనతతో టీ20 హిస్టరీలో కోహ్లీ టాప్‌లో నిలిచాడు.
IPL-26: RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు శివాలెత్తారు. అభిషేక్ శర్మ (56), ఇషాన్ కిషన్ (79), క్లాసెన్ (51) అర్ధసెంచరీలతో చెలరేగడంతో SRH నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో నితిష్ రెడ్డి 29 మెరుపులు మెరిపించాడు. RCB టార్గెట్ 256.