T20 WCలో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తొలగించాలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశాస్త్రి అభిషేక్‌కు మద్దతుగా నిలిచాడు. ఫైనల్లో అతడిని ఆడించాలని, తుది జట్టులో మార్పులు అవసరం లేదని సూచించాడు. ఫైనల్లో అభిషేక్ రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.