భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు వచ్చాయి. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లో నమోదైన 31 సిక్సర్ల రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది.