WGL: తన జన్మదినం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మాజీ సీఎంకు ఆరూరి వివరించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని మాజీ సీఎం తెలియాజేశారు.