సెమీఫైనల్లో తాము ఓడిపోవడానికి అక్షర్ పటేల్ అందుకున్న రెండు అద్భుతమైన క్యాచ్‌లే కారణమని ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. అక్షర్ పట్టుకున్న బ్రూక్, జాక్స్ క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి దూరం చేశాయని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి సమయాల్లో అక్షర్ అసాధారణమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. తాము ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.