భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 96/3 పరుగులు చేసింది. పెర్రీ(43), సదర్లాండ్(20) క్రీజులో ఉన్నారు.