టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలకు ఆదేశించింది. ఇందుకోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL సంస్థలకు సూచించింది. డ్యూయల్ సిమ్ వాడేవారికి ట్రాయ్ తాజా ఆదేశాల నేపథ్యంలో తక్కువ ధరలో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పాప్‌కార్న్‌పై GST కింద మూడు వేర్వేరు ట్యాక్స్ రేట్లు అమలు చేయడంపై నెట్టింట చర్చకు దారి తీసింది. ‘సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమెల్ 18శాతం.. మరి రెండూ కలిసుంటే పరిస్థితి ఏంటి’ అంటూ నెటిజన్లు Xలో పోస్ట్ చేశారు. ‘ఇకపై సాల్ట్ పాప్‌కార్న్ కొనండి. మిగిలిన డబ్బు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. 30 ఏళ్ల తర్వాత సంపదను ఊహించుకోండి’ అంటూ మరొకరు రాసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ.71,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450 ఉంది. అదేవిధంగా విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ.71,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450 ఉంది. కిలో వెండి ధర రూ.99,000గా ఉంది.
ASR: కొయ్యూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంప్యూటర్ నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో గణితం ప్రాధాన్యత సంతరించుకుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈవో ఎల్.రాంబాబు తెలిపారు. ముందుగా ఆయన ఉపాధ్యాయులతో కలిసి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
JEE మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన వారు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న JEE అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నారు. జూన్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు IIT కాన్పుర్ తెలిపింది. SC, ST, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 ఫీజుగా చెల్లించాలి. మే 11 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్&zwn...
ప్రకాశం: సంతనూతలపాడు మండలపరిధిలోని ఎండ్లూరు డొంకవద్ద మహిళా ప్రాంగణంలో ఈనెల 23వ తేదీన ఇన్ఫో సెవెన్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. జిల్లాలో 18-30 సంవత్సరాల వయస్సుగల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
W.G: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈసారి క్వశ్చన్ బ్యాంక్ కొత్త వెర్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
SKLM: ఎచ్చెర్లలో గల DR.BR అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలో B.ED, PG, DPED కోర్సులు చదువుతున్న విద్యార్థుల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూవర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ S. ఉదయ భాస్కర్ శనివారం విడుదల చేశారు. బీఈడీ కోర్సులో 279 మంది, DPEDలో 46 మంది ఉత్తీర్ణత సాధించారు. PGలో 19 కోర్సుల్లో 400 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ELR: పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నెలాఖరులోపు రుసుము చెల్లించాలని ఏలూరు జిల్లా డీఈవో వెంకటలక్ష్మమ్మ శనివారం తెలిపారు. పదో తరగతి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రయోగ పరీక్షలు ఒక్కో సబ్జెక్టుకు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. www.apopenschool.ap.gov.in ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు.
కృష్ణా: బ్రహీంపట్నంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపుగా 25 కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన యువతీ, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే కోరారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పురపాలక, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రకారం గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి ప్రక్రియ ఆదివారం నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఉదయం 10గంటలకు సీనియారిటీ జాబితాలోని పాఠశాల సహాయకులకు మధ్యాహ్నం కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈవో కార్యాలయంలో పరిశీలన ఉంటుందని తెలిపారు.
ASF: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రంలో ఈనెల 24న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసేందుకు అభ్యర్థులు SSC నుంచి ఏదేని డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: సర్వశిక్షఅభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC)గా సంపతిరావు శశిభూషణ్ నియమితులయ్యారు. గతంలో ఏపీసీగా పనిచేసిన రోనంకి రవిప్రకాష్ బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా శశిభూషణ్‌ను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
SKLM: చిన్నారులను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించి దాగిఉన్న సృజనాత్మకత వెలికితీయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో సుస్వర లహరి కార్యక్రమాన్ని శనివారం శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిర్లో నిర్వహించారు. విద్యార్థులను మ్యూజిక్, డాన్స్ పట్ల ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
కృష్ణా: మంత్రి లోకేశ్ అంటేనే జాబ్స్ క్రియేటర్ అని గుడివాడ MLA వెనిగండ్ల రాము శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా మంత్రి లోకేశ్ చొరవ తీసుకుని రూ. 14 వేల కోట్లతో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని MLA వెనిగండ్ల రాము Xలో ఆశాభావం వ్యక్తం చేశారు.