రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. సీబీటీ 1, సీబీటీ 2, సీబీఏటీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.