డెస్క్‌టాప్ యాప్ తర్వాత, ఏప్రిల్-2026లో Messenger.com వెబ్‌సైట్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇకపై బ్రౌజర్లో మెసెంజర్‌ను నేరుగా ఫేస్బుక్ ద్వారానే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. చాట్ సేవలను తిరిగి ప్రధాన ఫేస్‌బుక్‌లోకి అనుసంధానించే క్రమంలో మెటా ఈ మార్పులు చేస్తోంది. అయితే, మొబైల్ యాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.