• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పురిటినొప్పులతో గ్రూప్-2 పరీక్ష

TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నాగర్‌కర్నూల్ జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష రాస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అయినా అభ్యర్థి రేవతి పురిటి నొప్పులతోనే పరీక్ష రాస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు రేవతికి వైద్యం కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సిద్ధం చేశారు.

December 16, 2024 / 04:53 PM IST

100 బిలియన్ డాలర్ల క్లబ్‌ నుంచి అంబానీ ఔట్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ సంపద డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ వెల్లడించింది. ఇక అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాన సంపద 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది.

December 16, 2024 / 03:53 PM IST

ఈ వారం IPOకు మరో ఐదు కంపెనీలు

దేశీయ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగుతోంది. ఈ వారం ఐదు కంపెనీలు IPOకు రానున్నాయి. ప్రధాన విభాగంలో ట్రాన్స్‌రైల్ లైటింగ్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్, మమత మెషినరీ, సనాతన్ టెక్స్‌టైల్ IPOలు ఉన్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ ఈనెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. మరో కంపెనీ వెంటివ్ హాస్పిటాలిటీ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగుస్తుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో 12 కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి.&n...

December 16, 2024 / 02:15 PM IST

అభ్యర్థిని పొరపాటుతో పరీక్ష రాయలేకపోయింది

JN: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌2 పరీక్షకు మెుండ్రాయి పరిధిలోని ఓ తండాకు చెందిన భూక్య సునీత పొరపాటు కారణంగా పరీక్ష రాయలేకపోయింది. ఒకపాఠశాలకు బదులు మరొక పాఠశాలకు వెళ్లింది. ఆమెకు ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత.. తన పరీక్ష కేంద్రం కాదని బయటకు పంపించారు. వెంటనే తన పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే గేట్లను మూసేశారు. సిబ్బందిని ప్రాధేయపడినా అనుమతించపొవడంతో సునీత విలపిస్తూ తిరిగి వెళ్లింది.

December 16, 2024 / 10:38 AM IST

గ్రూప్-2 పరీక్షకు దూరమైన బాలింత

JN: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌2 పరీక్షకు మెుండ్రాయి పరిధిలోని ఓ తండాకు చెందిన బాలింత భూక్య సునీత పొరపాటు కారణంగా పరీక్ష రాయలేకపోయింది. ఒకపాఠశాలకు బదులు మరొక పాఠశాలకు వెళ్లింది. ఆమెకు ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత.. తన పరీక్ష కేంద్రం కాదని బయటకు పంపించారు. వెంటనే తన పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే గేట్లను మూసేశారు. సిబ్బందిని ప్రాధేయపడినా అనుమతించపొవడంతో సునీత విలపిస్తూ తిరిగి వెళ్లింది.

December 16, 2024 / 10:38 AM IST

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 289 పాయింట్ల నష్టంతో 81,843 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 24,692 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 84.84గా ఉంది.

December 16, 2024 / 09:37 AM IST

వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు 89 కంపెనీలు

ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగింది. వచ్చే ఏడాది కూడా ఈ జోరు కనిపించనుంది. 2025లో IPOకి వచ్చేందుకు 89 కంపెనీలు ప్రణాళిలు చేస్తున్నాయి. ఈ మేరకు సెబీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీలు మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల వరకు సమీకరించనున్నాయి. IPOకి రానున్న ప్రముఖ కంపెనీల్లో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, NSDL, JSW సిమెంట్, హీరో ఫిన్‌కార్ప్, ఏథర్ ఎనర్జీ ...

December 16, 2024 / 07:33 AM IST

ఊరంతా ఎడ్యుకేట్సే..!

WGL: దుగ్గొండి మండలంలోని పీజీతండాలో 120 ఇళ్లు ఉన్నాయి. అందులో 540 జనాభా ఉండగా ప్రతి ఇంటికి ఒక ఎడ్యుకేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా పలు ప్రభుత్వశాఖల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆ గ్రామానికి పీజీతండా అని పేరు వచ్చింది.

December 16, 2024 / 07:28 AM IST

జిల్లాలో మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష హాజరు వివరాలు

WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్ష మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలు వరంగల్ కలెక్టర్ సత్యశారద వెల్లడించారు. జిల్లాలో మొదటి పేపర్ పరీక్షకు 11,310 మంది అభ్యర్థులకు 5, 275 మందితో 46.64 హాజరుశాతం నమోదైంది. 6,035 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపరు 5, 245 మందితో 46.37 హాజరుశాతం నమోదైంది. 6,065 మంది గైర్హాజరైనట్లు ఆమె వెల్లడించారు.

December 16, 2024 / 07:07 AM IST

నేడే ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు ఆఖరి గడువు

KMM: వయస్సు, అర్హతతో సంబంధం లేకుండా పదో తరగతి, ఆ తరువాత ఇంటర్ చదివే అవకాశం ఉన్న ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ కో- ఆర్డినేటర్ అనురాధ సూచించారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశానికి ఈ నెల 16 వరకు అవకాశం ఉందన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 16, 2024 / 05:01 AM IST

నేటి నుంచి ఆరోగ్య శాఖలో దరఖాస్తుల స్వీకరణ

 NZB: వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 4 ఇంజినీర్ ఉద్యాగాలను భర్తీ చేయనున్నట్లు DMHO డా.రాజశ్రీ తెలిపారు. అభ్యర్థులు B.Tech (CSE/IT/ECE) అర్హత, కనీసం 4 సంవత్సరాల టెక్నికల్ అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 16 నుంచి 23 సాయంత్రం 5 గంటలలోపు DMHO కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు.

December 16, 2024 / 04:59 AM IST

నేడు హెల్ప్ డెస్క్ ద్వారా ఆర్జీల స్వీకరణ

మెదక్: గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి, తమ సమస్యలను తెలుపవచ్చునని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.

December 16, 2024 / 04:22 AM IST

గ్రూప్-2 పరీక్షకు ఆసక్తి చూపని అభ్యర్థులు

TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరీక్షలకు రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపనట్లుగా కనిపిస్తోంది. ఇవాళ మొదటి రోజు పరీక్షలు జరగగా.. హాజరుశాతం భారీగా తగ్గింది. సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. పేపర్-1కు 46.75 శాతం అభ్యర్థులు హాజరు కాగా.. పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

December 15, 2024 / 09:40 PM IST

గ్రూప్-2 పరీక్షలో చీటింగ్

TG: మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష ముగిసింది. అయితే, పరీక్ష కేంద్రంలోకి ఓ అభ్యర్థి ఫోన్ తీసుకెళ్లాడు. ఎగ్జామ్ రాస్తుండగా చూసిన ఇన్విజిలేటర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రలోకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.

December 15, 2024 / 08:51 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలించిన డీఐజీ

MBNR: గ్రూప్-2 పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని JPNCE కళాశాల పరీక్షా కేంద్రం వద్ద జోన్- 7 డీఐజీ ఎల్.ఏస్.చౌహన్, ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను నేడు పరిశీలించారు. సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.

December 15, 2024 / 01:18 PM IST