SBI టాప్ మేనేజ్మెంట్ ఫేక్ వీడియోలపై బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు Xలో పోస్టు పెట్టింది. ‘బ్యాంక్ మేనేజ్మెంట్ వ్యక్తులంటూ వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మవద్దు. వీడియోలో చెప్పిన పథకాలతో బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదు. అసాధారణ రాబడి వచ్చే పథకాలను SBI ప్రవేశపెట్టదు. ప్రజలు మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొంది.
దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులకు SSC ఈనెల 10, 11న పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్, ప్రిలిమినరీ ‘కీ’ని SSC విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 16 నుంచి 18లోపు అభ్యంతరాలు తెలియజేయాలి.
ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 13,735 క్లర్క్ పోస్టులకు నోటిషికేషన్ విడులైంది. డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్/ టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
2024లో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని వీడియోలు అత్యధిక వ్యూస్ సంపాదించాయి. వాటిలో దక్షిణ కొరియాకు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్ 15 బిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టింది. 8 ఏళ్ల కిందట పింక్ ఫాగ్స్ కిడ్స్ ఛానల్ షేర్ చేసిన ఈ వీడియో ఈ ఏడాది దుమ్మురేపింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో లూలూ కిడ్స్ ఛానల్లోని జానీ జానీ ఎస్ పాపా వీడియో (6.98 బిలియన్ వ్యూస్) [...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 24,598 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.92గా ఉంది.
ఈ వారం పలు కంపెనీలు IPOల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈనెల 19 నుంచి 23 వరకు నాలుగు కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ధరల శ్రేణి రూ.269-283, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ రూ.665-701, ట్రాన్స్‌రైల్ లైటింగ్ లిమిటెడ్ రూ.410-432, సనాతన్ టెక్స్టైల్స్ రూ.305-321గా కంపెనీలు నిర్ణయించాయి.
LIC వద్ద గత ఆర్థిక సంవత్సరంలో మెచ్యూర్టీ అయిన అన్క్లెయిమ్డ్ బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మెచ్యూర్టీ బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేయని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నారని వెల్లడించింది. 2022-23 మధ్య కాలంలో 3,73,329 మంది ఉండగా.. వీరికి సంబంధించి రూ.815 కోట్లు నిధులు ఉన్నాయని పేర్కొంది. 2023-24లో రూ.14 లక్షల విలువైన మరణానికి సంబంధించిన అన్క్లెయిమ్డ్ నిధు...
CTR: కార్వేటినగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి లోకనాథం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ చేసిన వారు సైతం ఇందులో పాల్గొనవచ్చని, 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు అర్హులని వివరించారు.
SKLM: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ అర్థ సంవత్సర పరీక్షలు ప్రారంభం కాలున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా డీఈవో తవిటినాయుడు ఏర్పాట్లుగా పూర్తి చేసినట్లు తెలిపారు.
BDK: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రోఫైనాన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు ఎంపీడీవో కార్యాలయంలో ఉ. 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన వారిని అర్హులుగా ప్రకటించారు.
SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోవిందమ్మ తెలిపారు. ఈ మేరకు ఇంటర్, ITI , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 19 నుంచి 30 ఏళ్ల వయసు గల యువకులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
➢ మార్చి 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1➢ మార్చి 7: ఇంగ్లీష్ పేపర్-1➢ మార్చి 11: మ్యాథ్స్ పేపర్ 1A, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1➢ మార్చి 13: మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1➢ మార్చి 17: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1➢ మార్చి 19: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
➢ మార్చి 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2➢ మార్చి 10: ఇంగ్లీష్ పేపర్-2➢ మార్చి 12: మ్యాథ్స్ పేపర్-2A, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2➢ మార్చి 15: మ్యాథ్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2➢ మార్చి 18: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2➢ మార్చి 20: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
TG: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1శాతం ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ట్స్రూమెంట్ల(PPI) పైనే ఛార్జీలు ఉంటాయని స్ప...