బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో తులం బంగారం రూ.80వేలు దాటినప్పటి నుంచి రూ.లక్షకు చేరుతుందేమోనని అనుకుంటున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 87,500 ఉండగా ఇవాళ రూ.110 పెరిగి రూ. 87,610కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 79,800 ఉండగా.. నేడు రూ.100 పెరిగి రూ. 79,900కు చేరింది.
KNR: RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు ఈ నెల 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ముగుస్తుందని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలవుతుందని అన్నారు.
SKLM: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన గొనప జగ్గు నాయుడు అనే విద్యార్థి ఇటీవల విడుదలైన జెఈఈ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఎంఈవో శివరాం ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష లో 97.8 పర్సంటైల్తో ఉత్తీర్ణత సాధించారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 12వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి బి.రాఘవేందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డి. ఫార్మసి, బి. ఫార్మసీ, డిప్లొమో ఇన్ అగ్రికల్చర్, డిప్లొమో ఇన్ హార్టి కల్చర్ చదివిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ ఆవకాశంను నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.
E.G: జిల్లాలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు RIO NSVL నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. తొలి విడతాగా 58 కేంద్రాల్లో ఇవాల్టి నుంచి ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
ATP: JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్ 3-1సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ(R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్‌సైట్https://jntuaresults.ac.inను సందర్శించాలని సూచించారు.
NDL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న నంద్యాలలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి మస్తాన్ వలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మట్లాడుతు KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జాబ్ మేళాలో వివిధ సంస్థలకు చెందిన కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారని విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
BDK: జిల్లాలోని ఐటీడీఏ గిరిజన నిరుద్యోగ యువకులకు పలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం పీవో రాహుల్ ప్రకటించారు. ఉపాధి కోసం పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీసీ ప్రథమ సంస్థ ద్వారా బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్‌లో రెండు నెలల ఉచిత భోజన వసతితో శిక్షణ ఇస్తారని తెలిపారు.
HYD: హైదరాబాద్ పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి 382 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. టెన్త్ పాసై వయసు 18-24 సంవత్సరాలు ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆశక్తి గలవారు iocl.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
SKLM: పాఠశాలలను విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ మేరకు పాలకొండ ఎంఈఓ కార్యాలయం వద్ద గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన విద్యార్థుల, తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల విలీనం చేయడం ద్వారా విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్‌లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.
TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఒక ఏడాదిపాటు గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. గ్రాడ్యు యేట్-19, డిప్లమా- 7 మొత్తం 27 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా వెల్లడించింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఈఏపీసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగనుంది.
VZM: గరివిడి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నిరవధిక దీక్ష చేపట్టారు. స్టైఫండ్ వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని దీక్షకు దిగారు. మెడికల్ విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు పశువైద్య విద్యార్థులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.