AP: రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22.55 పాయింట్లు లాభపడి 23,750.20 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.26గా ఉంది.
ఎన్టీఆర్: విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈనెల 28న మెగా వికసిత్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ పార్లమెంట్ పరిధిలోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్ని జాతీయ బ్యాంకుల పనివేళలు ఒకే విధంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడిచేలా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
TGPSC గ్రూప్-1పై అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీవో 29పై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఫలితాలు విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, జీవో 29 ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వీలైనంత త్వరగా హైకోర్టు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.
ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను జనవరి 14వ తేదీలోపు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు చెప్పారు. ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులందరూ అర్హులేనని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చర్చలో పాల్గొని పరీక్షలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతారన్నారు.
కోనసీమ: అమలాపురం నల్లవంతెన వద్ద మిరియం కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎమ్.తమ్మేశ్వరరావు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూకు బయోడేటా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
KRNL: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. గత వైకాపా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పుస్తకాలు, పలకలు ఇవ్వలేదు. ఇంతకాలం పాత వాటితోనే కాలం నెట్టుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా ముద్రించిన నూతన పుస్తకాలను సరఫరా చేస్తోంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో మరింత మంది సభ్యులు పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం అక్టోబర్లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను EPFO నమోదు చేసింది. 2024 అక్టోబర్లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వల్ల EPFO పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.
వాట్సాప్లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్ను స్కాన్ చేయాలంటే నేరుగా వాట్సాప్లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. PDF, బ్లాక్&వైట్ మోడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి.
ఫిన్టెక్ యునికార్న్ రేజర్పే తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
AP: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మరోసారి గడువు పొడిగించింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు తేదీని ఈనెల 24 ఆఖరు గడువని స్పష్టం చేసింది. ఫీజు గడువు ముగియడంతో ఈనెల 31వ తేదీ వరకు తత్కాల్ పథకం కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు.
ఐఫోన్ 15 128GB రూ.69,990. ఈ ప్రీమియం డివైజ్ పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛ్ంజ్ ఆఫర్లు కలుపుకొని రూ.26,999కే ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఫ్లిప్కార్ట్ కల్పించింది. అందుకోసం మన ఐఫోన్ 14ను ఎక్స్ఛ్ంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్ఫోన్ను రూ.26,999కే మీ సొంతం చేసుకోవచ్చు.
KMM: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ప్రస్తుత విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశముందని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం. పాపారావు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించినందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.