ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో మరింత మంది సభ్యులు పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను EPFO నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వల్ల EPFO పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. PDF, బ్లాక్&వైట్ మోడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి.
ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
AP: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మరోసారి గడువు పొడిగించింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు తేదీని ఈనెల 24 ఆఖరు గడువని స్పష్టం చేసింది. ఫీజు గడువు ముగియడంతో ఈనెల 31వ తేదీ వరకు తత్కాల్ పథకం కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు.
ఐఫోన్ 15 128GB రూ.69,990. ఈ ప్రీమియం డివైజ్ పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛ్ంజ్ ఆఫర్లు కలుపుకొని రూ.26,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. అందుకోసం మన ఐఫోన్ 14ను ఎక్స్ఛ్ంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.26,999కే మీ సొంతం చేసుకోవచ్చు.
KMM: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ప్రస్తుత విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశముందని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం. పాపారావు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించినందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 54 పరీక్ష కేంద్రాలలో 1,0051 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వెల్లడించారు.
KKD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి సంస్థ, గవర్నమెంట్ ఐటీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజరవుతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18-35 సంవత్సరాల వయసు గల వారు అర్హులన్నారు.
TG: గురుకుల ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు 2025 ఫిబ్రవరి 5 ఆఖరు తేదీ కాగా.. పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదల కాగా, 23వ తేదీ నుంచి ఆన్లైన్ అఫ్లికేషన్ ప్రారంభమైంది. కాగా.. ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
KNR: జిల్లాలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 27న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని, జిల్లా సంక్షేమ అధికారి కె. సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
టెలికాం యూజర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు టెలికాం విభాగం(డాట్) ఓ ప్రకటన విడుదల చేసింది. 24గంటల్లోనే 1.35కోట్ల ఫోన్ నంబర్లను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేశారని డాట్ తెలిపింది. ముఖ్యంగా +8, +85, +65 వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి మోసగిస్తున్నారని చెప్పింది.
ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA జరిమానా విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఆకాశ విమానం ఒకటి బెంగళూరు నుంచి పుణెకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే, బోర్డింగ్‌కు పలువురు ప్రయాణికులను అనుమతించకపోగా.. వారికి పరిహారం అందజేయడంలో విఫలమైంది. దీంతో ఆ సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షలు జరిమానా విధించింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ సేవలకు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. క్రిస్మస్ వేళ విమాన సేవలు నిలిచిపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌పై నెట్టింట పోస్టులు పెట్టారు. దీంతో స్పందించిన సంస్థ.. విమాన సేవలు తిరిగి అందుబాటులోకి తెచ్చింది.
భారత్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. Vivo Y29 5G కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. 4GB+128GB రూ.13,999, 6GB+128GB రూ.15,499, 8GB+128GB రూ.16,999, 8GB+256GB రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వివో తెలిపింది.