SKLM: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో గురువారం నిర్వహించిన వీర బాల దివాస్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులను రాజు, మంత్రి, జాతీయ ఉద్యమం నాయకుల వేషధారణలు వేయించారు. చిన్నారులకు వారి గూర్చి వివరించారు.
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా, బిటెక్ అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.vizagsteel.com/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 9 వరకు అవకాశం ఇచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.5 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా వేసింది. జీడీపీ వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయింది. అధిక ద్రవ్యోల్బణం వల్ల RBI వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే, పట్టణ వినియోగ వృద్ధి తగ్గడానికి ప్రైవేటు రంగ నియామకాలు తగ్గడం కూడా ఓ కారణమని నివేదిక పేర్కొంది.
వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది.. భౌగోళికంగా, రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వీటి వల్ల ప్రపంచ స్థూల ఆర్థిక ముఖం చిత్రం మారిపోయిందని అన్నారు. మున్ముందు ఇమ్మిగ్రేషన్, వాణిజ్యం వంటి వాటిల్లో సవాళ్లు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా.. తన వాహన శ్రేణిని ఆధునికీకరిస్తోంది. ఇటీవల యాక్టివా 125, ఎస్ 125, ఎస్పీ 160 వాహన శ్రేణిని ఆధునికీకరించగా.. తాజాగా 2025 మోడల్ యూనికార్న్‌ను ఆవిష్కరించింది. దీనికి క్రోమ్ అలంకారంతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌ను ఇచ్చారు. ఈ బైక్‌లో పుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు గురువారం తెలిపారు. అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9:30 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని అన్నారు.
AP: రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22.55 పాయింట్లు లాభపడి 23,750.20 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.26గా ఉంది.
ఎన్టీఆర్: విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈనెల 28న మెగా వికసిత్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ పార్లమెంట్ పరిధిలోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్ని జాతీయ బ్యాంకుల పనివేళలు ఒకే విధంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడిచేలా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
TGPSC గ్రూప్-1పై అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీవో 29పై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఫలితాలు విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, జీవో 29 ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వీలైనంత త్వరగా హైకోర్టు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.
ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను జనవరి 14వ తేదీలోపు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు చెప్పారు. ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులందరూ అర్హులేనని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చర్చలో పాల్గొని పరీక్షలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతారన్నారు.
కోనసీమ: అమలాపురం నల్లవంతెన వద్ద మిరియం కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎమ్.తమ్మేశ్వరరావు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూకు బయోడేటా, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
KRNL: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. గత వైకాపా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పుస్తకాలు, పలకలు ఇవ్వలేదు. ఇంతకాలం పాత వాటితోనే కాలం నెట్టుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా ముద్రించిన నూతన పుస్తకాలను సరఫరా చేస్తోంది.