TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇరాన్-అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ముడి చమురు ధర 80 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా చమురు రంగ షేర్లు పతనమయ్యాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5 శాతం మేర కుంగింది. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి.
దేశీయ స్టార్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1,565.54 పాయింట్ల నష్టంతో 79,721.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల నష్టంతో 24,698.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్- 30లో BEL, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 47 ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. PG, MPhil, PhD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు మినహాయింపు కలదు. వెబ్‌సైట్: uohyd.ac.in
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,290 తగ్గి రూ.1,69,800కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,55,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.3,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1100 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.91.32గా ఉంది.
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లింపునకు ఎల్లుండి చివరి తేదీ కాగా, 5-14 తేదీల్లో అప్లికేషన్ సవరణ చేసుకోవచ్చు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 రాత పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు ముందుగా తమ పరీక్షా నగరాన్ని తెలుసుకునేందుకు వీలుగా బోర్డు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ రంగంలో అర్హత కలిగిన వారు MAR 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను.. బయోటెక్నాలజీ&బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-500046కు పోస్టు(ఆఫ్‌లైన్)ద్వారా పంపాల్సి ఉంటుంది.
తెలంగాణ పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉందన్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మే 13న రాత పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు polycet.sbtet.telangana.govను సంప్రదించండి.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కరోజే తులం బంగారంపై రూ.4,000 పెరిగి రూ.1,68,710 (24K)కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650గా ఉంది. వెండి కిలోకు రూ.25,000 పెరిగి రూ.3,20,000 మార్కును తాకింది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు వీటిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.
అమెరికా టెక్, కార్పొరేట్ రంగాల్లో లేఆఫ్స్ భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. AI ప్రభావం, ఖర్చుల నియంత్రణ కారణంగా వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. యునైటెడ్ పార్సెల్ సర్వీస్ (78K), అమెజాన్ (30K), ఇంటెల్ (25K), మైక్రోసాఫ్ట్ (15K) వంటి దిగ్గజ సంస్థలు భారీగా సిబ్బందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది ఉపాధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.