NLG: MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక,సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒకప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్యవార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును12 ఫిబ్రవరి 2025 లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలన్నారు.
జనగాం: జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, పొలిటికల్ సైన్స్ బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. జనవరి 2న దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
PLD: క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నేడు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా రావిపాటి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. 35 పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గటంలో రూ.77,840 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.71,350కి చేరింది. కాగా, కిలో వెండి ధరపై రూ.100 తగ్గటంతో రూ.99,900గా ఉంది.
TG: అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో కామన్ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కొత్త సిలబస్ తయారు చేసే పనిలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బిజీగా ఉంది. దీనికోసం నాలుగు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. 2025–26 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
విశాఖపట్నంలోని వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వర రావు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం cfw.ap.nic.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
NLR: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ యాజమాన్యం పరిధిలో నిర్వహిస్తున్న ఆయా పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 11మంది, కావలి, గూడూరు ముగ్గురికి స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు.
NLR: పలు మున్సిపల్ కార్పొరేషన్లలో సర్వీస్ ప్రొవైడర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా పీడీ రాధా తెలిపారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, బుచ్చి, కందుకూరు కార్పొరేషన్ల పరిధిలో పలు కేటగిరీలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు, మరిన్ని వివరాలకు 7901311585 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలోని మోడల్ స్కూళ్లల్లో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ. 125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
VSP: పాయకరావుపేటలో స్పేస్ డిగ్రీ కళాశాల NH16 శనివారం ఉదయం 9 గంటల నుంచి నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎంపీటీసీ ప్రకాష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాయకరావుపేట నియోజకవర్గంలో 50 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని M.A కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యూషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దీనికోసం అభ్యర్థులు https://results.andhrauniversity.edu.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
SBI ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం 600 పోస్టులు భర్తీ చేయబడతాయి. వీటిలో 586 రెగ్యులర్, 14 బ్యాగ్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష అధికారులు వచ్చే ఏడాది మార్చి 8, 15 తేదీలలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కాగా.. జనవరి 16వ తేదీ నాటికి ముగియనుంది.
SKLM: కవిటి ప్రభుత్వ పాఠశాలలో పరీక్షా పే చర్చా కార్యక్రమంపై ఎంఈఓ ధనుంజయ్ అవగాహన కల్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం పరీక్షా పే చర్చతో లభిస్తుందని ధనుంజయ్ అన్నారు. బోర్డు, ప్రవేశ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
WNP: జిల్లాలోని నిరుద్యోగులకు 5 ప్రైవేటు కంపెనీలలో పని చేయడానికి ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 460 ఖాళీలు ఉన్నాయని, 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు, అర్హత సర్టిఫికెట్లతో PMKK సెంటర్, రామాలయం, సాయి నగర్ కాలనీలో సోమవారం హాజరు కావాలని పేర్కొన్నారు.
KKD: తపాలా జీవిత బీమా డైరెక్ట్ ఏజెంట్లుగా పని చేయుట కొరకు ఉత్సాహవంతులైన అర్హత గల యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ సీహెచ్. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. దరఖాస్తు నమూనా కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, కాకినాడ డివిజన్‌లో ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా పొందవచ్చన్నారు.