హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.