ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు apcfss.inను సంప్రదించండి.