CTR: తిరుచానూరు రోడ్డులోని నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో మహిళలకు టైలరింగ్, నర్సింగ్ విభాగంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా తెలిపారు. రెండునెలల కాలవ్య వధిలో జరిగే శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 వయసుగల మహిళలు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
సింగపూర్‌కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది. తన వాటాలో విల్మర్ ఇంటర్నేషనల్‌కు 31.06 శాతం, ఓపెన్ మార్కెట్లో మరో 13 శాతం విక్రయించేందుకు నిర్ణయించింది. దాని మొత్తం విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
TG: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆయన నివాసంలో సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ, AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం కోరారు. US తర్వాత మైక్రోసాఫ్ట్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందన్నారు.
వరల్డ్ నెంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. యూరప్‌లో ఐఫోన్ 14, ఎస్ఈ ఫోన్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగటంతో రూ.78,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,500కు చేరింది. కాగా.. కిలో వెండి ధర రూ.99,900గా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 187.86 పాయింట్ల నష్టంతో 78,520 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 23,762 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.53గా ఉంది.
Vsp: రేపు విశాఖ జిల్లా కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించినునట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ అధికారి చాముండేశ్వరరావు తెలిపారు. మేళాలోప్పలు కన్స్ట్రక్షన్, పలు ఫైనాన్స్, మెడిప్లస్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిగ్రీ డిప్లమా ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
TG: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో BED(ODL) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.braouonline.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. రేపు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. జనవరి తొలివారంలో ఫలితాలు, మూడో వారంలో కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.
ASR: హుకుంపేట మండలంలోని ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. నాడు నేడులో భాగంగా 2022-23 సంవత్సరంలో రూ.23 లక్షలు పాఠశాల నిర్మాణానికి మంజూరయ్య పిల్లర్ లెవెల్ వరకు నిర్మించి మధ్యలో నిలిచిపోయిందని తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో విద్యా బోధనలు సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
VSP: పిల్లలను అభివృద్ధి పథంలో నడిపేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టార్లు, గైడ్ కెప్టెన్స్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. రైల్వే న్యూ కోలని ఈస్ట్ కోస్ట్ క్యాంపింగ్ సెంటర్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు కన్న పిల్లలాగా అభివృద్ధి పథాన నడిపే దిక్సూచిలా ఉండాలన్నారు.
ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నేడు వినుకొండ రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో డీమర్టీ, ప్రీమియర్ సోలార్ ఎనర్జీ వంటి పలు కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ అవకాశం నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 2019 అడ్మిటెడ్ బ్యాచ్‌కు సంబంధించి 1, 3, 5 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి జి. పద్మారావు విడుదల చేశారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును జనవరి 10వ తేదీలోపు చెల్లించాలని సూచించారు.
SKLM: వీరఘట్టం యుటిఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 226 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మజ్జి పైడిరాజు తెలిపారు.
పార్వతీపురం ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థుల చదువును రాత్రి సమయాలలో ఉపాధ్యాయులు గమనించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా టెన్త్ ఉత్తీర్ణత రాష్ట్ర స్థాయిలో జిల్లాను తొలి స్థానంలో నిలపాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామన్నారు.