E.G: రాజమండ్రిలో నవంబర్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ మేళాలో సెరా కేర్ హప్పి లైఫ్, గూగుల్ పే సంస్థలలోని పలు ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసి 19 – 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు.
దేశ పరిపాలన వ్యవస్థలో అత్యున్నత పోస్ట్‌గా భావించే కేబినెట్ సెక్రటరీ పదవిని చేరుకోవాలని ప్రతి ఒక్క IAS కల. అయితే ఈ పదవి 35 నుంచి 40 ఏళ్ల అత్యుత్తమ సర్వీస్ తర్వాత మాత్రమే దక్కుతుంది. దీనికి ఎంపికయ్యే అధికారికి పదవీ విరమణకు ముందు కనీసం 1-2ఏళ్ల పదవీ కాలం ఉండాలి. అందుకే 21-25ఏళ్ల వయసులో IAS సాధించిన వారికి ఈ పదవీ వచ్చే అవకాశాలు ఎక్కువ.
కార్పొరేట్ జాబ్ వదిలేసి, లాభాల్లో ఉన్న బిజినెస్ వైపు వెళ్లాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి నిపుణుల సలహా ఏంటంటే.. ఉద్యోగం ‘ఫైనాన్షియల్ సెక్యూరిటీ’ ఇస్తుంది. కానీ బిజినెస్ అంటే 24 గంటల పని, రిస్క్ భరించాలి. పోటీని తట్టుకునే సత్తా, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే జాబ్ మానేయండి. లేదంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేవరకు రెండూ బ్యాలెన్స్ చేయడమే సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే 72 రోజుల పాటు డైలీ 2GB డేలా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇదే తరహా ప్లాన్లను ఇతర టెలికాం కంపెనీలు రూ.700-800 రేంజ్‌లో అందిస్తున్నాయి.
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,17,250 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,76,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
JN: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, MLC తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. తన ఐకానిక్ మోడల్ సియారాను మళ్లీ తీసుకొచ్చింది. 1991లో తొలిసారి విడుదలైన ఈ మోడల్‌ను.. 2003లో నిలిపివేసింది. దీన్ని ‘రీబర్త్ ఆఫ్ ఎ లెజెండ్’గా అభివర్ణించింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
టెన్త్, ఇంటర్, జేఈఈ మెయిన్, నీట్, గేట్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. దీంతో ఇప్పటినుంచే సరైన ప్రణాళిక వేసుకుంటే తప్ప మంచి స్కోర్ సాధించడం కష్టమని నిపుణులు అంటున్నారు. టైం మేనేజ్‌మెంట్ ఉండాలని.. వాయిదా వేయడం మానుకోవాలని తెలిపారు. బట్టీ పట్టకూడదు, రివిజన్, ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఫోన్‌కు దూరంగా ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
TG: టెట్ దరఖాస్తులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,085 దరఖాస్తులు అందినట్లు టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. పేపర్ 1 కు 46,954, పేపర్ 2కు 79,131 దరఖాస్తులు వచ్చాయి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండానే RRB పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,116 అప్రెంటిస్ పోస్టులకు గాను అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అర్హులైన వారు రేపటి నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,320.04 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,710.11 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 331.21 పాయింట్ల నష్టంతో 84,900.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.65 పాయింట్ల నష్టంతో 25,959.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.89.19గా ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గి రూ.1,25,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 తగ్గి రూ.1,14,700 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,71,000కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
AP: టెట్‌కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుకు ఆదివారం చివరి తేదీ కావడంతో సాయంత్రం వరకు 2,58,638 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా, పురుషులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 65 శాతం మంది మహిళలే ఉన్నారు. పేపర్-1ఏ కు 1,01,882, పేపర్-2ఏ కు 1,51,220 దరఖాస్తులు వచ్చాయి.
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు ఈ క్రేజీ సేల్ కొనసాగనుంది. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై వేలల్లో డిస్కౌంట్లు ఉన్నాయి. Samsung Galaxy S24 5G అసలు ధర రూ.74,999 ఉండగా, ఇప్పుడు దాన్ని కేవలం రూ.40,999కే కొనుగోలు చేయవచ్చు. Poco M7 5G వంటి 5G ఫోన్లు కూడా రూ.10,000 లోపు అందుబాటులో ఉన్నాయి.
TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన MBA పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. MBA (టెక్నాలజీ మేనేజ్మెంట్), MBA (ఈవినింగ్) కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అధికారి తెలిపారు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.