అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,182 పాయింట్లు పడిపోయి 76,724కి, నిఫ్టీ 659 పాయింట్లు తగ్గి 23,747 స్థాయికి చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.92.29గా ఉంది.