‘టెక్ మహీంద్రాలో భారీ లేఆఫ్‌లు’ అంటూ జరుగుతున్న ప్రచారంపై దిగ్గజ టెక్ సంస్థ స్పందించింది. ఉద్యోగులను తొలగించబోతున్నామనే వార్తల్లో వాస్తవం లేదని, కంపెనీ వద్ద ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్టాక్ ఎక్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టంచేసింది. కాగా AI ప్రభావంతో సదరు టెక్ కంపెనీ 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.