NZB: సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామం నుంచి పూసల తండాకు వెళ్ళే రోడ్డు గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.