టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నది. కాగా, బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు యాడ్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించవచ్చని కంపెనీలు భావించాయి.