ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 141 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ తదితర పోస్టులు ఉండగా.. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. 18-35 ఏళ్ల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apps.shar.gov.in/
TG: జేఈఈ పరీక్షలో రాష్ట్రంలోని ఏకలవ్య గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25 ఏడాదికి తెలంగాణ EMRSల నుంచి రికార్డు స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జేఈఈ మెయిన్స్లో 60 మంది, అడ్వాన్స్డ్లో పది మంది మెరుగైన ప్రతిభతో విద్యాసంస్థల్లో సీట్లు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) బోర్డు పరీక్షలు 2026 ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 6 వరకూ 12వ తరగతి, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకూ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 2.6 లక్షల మంది విద్యార్థులు ICSE (10వ తరగతి), 1.5 లక్షల మంది విద్యార్థులు ISC (12వ తరగతి) పరీక్షలకు హాజరవుతారు.
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)లో 49 గ్రూప్-C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. 18-28 ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP: రాష్ట్రంలో సమ్మెటివ్-1 పరీక్షల నిర్వహణలో భాగంగా ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 1-5 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈనెల 17న, 6-10 తరగతులకు తిరిగి ఈనెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ను ఈరోజు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://schooledu.telangana.gov.inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP: పదో తరగతిలో ప్రతిభ చాటిన బీసీ గురుకులాల విద్యార్థులకు మంత్రి సవిత గుడ్న్యూస్ చెప్పారు. ఈ ఏడాది నుంచి నీట్, ఐఐటీల ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలోని సింహాచలం గురుకులంలో బాలురకు, శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు గురుకులంలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు జరగనున్నాయి.
TG: రాష్ట్రానికి మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కే దిశగా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లాలోని ముడుమాల్లో ఉన్న దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణానికి.. యునెస్కో గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు NGRI, పరావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
TG: నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో 1000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీలో మరో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వచ్చే ఏడాది చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, 114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.
TG: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరంతా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సహాయం పొందిన వారే కావడం గమనార్హం.
ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. గడువులోగా పూర్తి చేయకపోతే ITR ఫైల్ చేయలేరు. మీకు రావాల్సిన ఐటీ రిటర్న్స్ ఆగిపోతాయి. అధిక టీడీఎస్, టీసీఎస్ వర్తిస్తాయి. బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయలేరు. డెబిట్, క్రెడిట్ కార్డుల జారీలో సమస్యలు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ కొనడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
రైలిండియా టెక్నికల్&ఎకనామిక్ సర్వీస్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని భర్తీ చేసేందుకు పూర్తి చేయాల్సిన దరఖాస్తుల ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.29,735 వరకు జీతం ఇస్తారు. వివరాలకు www.rites.com వెబ్సైట్ చూడండి.