SKLM: జిల్లాలోని డిగ్రీ కాలేజీల వేసవి సెలవులు ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలు మళ్లీ తెరచుకొనున్నాయి.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని అనుబంధ ప్రభుత్వ ప్రైవేటు, డిగ్రీ కళాశాలలో జూన్ 16వ తేదీ నుంచి తెరచుకోనున్నట్లు యూనివర్సిటీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే ఉద్యోగమేళాలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు రామచంద్రపురం ఉపాధి భవనంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. టెన్త్ నుంచి ఆ పైన చదివిన వారందరినీ అర్హులుగా ప్రకటించింది.
AP: డీఎస్సీ పరీక్షల తేదీల్లో ప్రభుత్వం మార్చింది. ఈ నెల 20, 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్చింది. ఆయా పరీక్షలు వచ్చే నెల 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. యోగా డే సందర్భంగా డీఎస్సీ పరీక్షలు తేదీలు మార్చినట్లు పేర్కొంది.
SKLM: ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్న అంగన్వాడి కేంద్రాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి అందిస్తున్న పౌష్టికాహారల గురించి అడిగి తెలుసుకున్నారు.
SRCL: ఐటిఐ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ఐటిఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటారు వెహికిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, మెకానిక్ డీజిల్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ కోర్టులకు ఆసక్తి గల విద్యార్థులు https://iti.telangana.gov.in లో అప్లై చేసుకోవలన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూలులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీపీ సుమతి, ఎంఈవో పిచ్చియ్య, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ దివి శ్రీను, హెచ్ఎం శైలజ పాల్గొన్నారు.
SKLM: ప్రధాన మంత్రి బాలపురస్కార్ దరఖాస్తుల గడువు జులై 31వ తేదీ వరకు పెంచారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి బి. శాంతిశ్రీ తెలిపారు. సంస్కృతి, సామాజిక సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ చూపిన 5 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే బాలలు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులన్నారు. బాలలు స్వయంగా లేదా వెబ్సైట్లో చేసుకోవాలి.
సత్యసాయి: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. సత్యసాయి జిల్లాలో 5,588 మంది పరీక్ష రాయగా.. 3,986 మంది పాసయ్యారు. 71.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.
KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని MLA శ్యాంబాబు, స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకొని, 18 నుంచి 35 ఏళ్ల వయసున్నవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 16 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
AP: కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీపీఎస్సీ కాసేపట్లో ఫలితాలను విడుదల చేయనుంది. కాగా, 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనుంది.
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఆగస్టు 14 లోపు తరగతులను ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని, ఆగస్టు 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 4 విద్యాసంస్థలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని బాలకిష్టారెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.
KRNL: జూన్ 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్నందున గ్రామాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు సమయానికి విద్యార్థి బస్సు సేవలు అందించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతిపత్రం అందజేశారు. ఆదోని డివిజన్లో వందల మంది పేద విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు.
SKLM: జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా 284 మందికి గాను 128 మంది ఇప్పటి వరకు విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపల్ సుధాకరరావు ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
E.G: ఈనెల 13న అనపర్తిలోని సాయి మాధవి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. పదికి పైగా అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొని, పదవ తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కో-ఆర్డినేటర్ గుంపుల గ్రేస్ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరుగుతుందన్నారు.