AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో (టెట్) 39.27 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ వెల్లడించింది. 31,886 మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలు రాశారు. ఇందులో 47.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ ఫలితాలను tet2dsc.apcfss.in, cse.ap.gov.inలో చూసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు.