TG: ఖమ్మం నగరంలో నడిరోడ్డుపై ప్రమిళ అనే వివాహితను దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. నగరంలోని కస్బానగర్లో ఈ ఘటన జరగ్గా.. మృతురాలిని భద్రాచలం వాసిగా గుర్తించారు. పిల్లలు పుట్టని కారణంతో ఆమె, తన భర్త RMP డాక్టర్ BN రావు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఆమెను శ్రావణ్ అనే ఫ్రెండ్ వేధించడంతో.. అతనిపై కేసు పెట్టింది. దీంతో అతనే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.