JN: ఫ్రాక్లైన్ టెంపుల్టన్ రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో జనగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనం పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ భవనాన్ని శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత ప్రశంసనీయమన్నారు. కొత్త భవనంతో బాలికలకు మెరుగైన మౌలిక వసతులు అందుతాయన్నారు.