RR: ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంకితభావం కలిగిన యువ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అసెంబ్లీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో యూత్ కాంగ్రెస్ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.