SS: వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడలో 5 కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని, రాఘవయ్య పార్క్‌లోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మారథాన్‌ను ప్రారంభించి యువతతో కలిసి పరుగెత్తారు. విజేతలకు బహుమతులు అందజేసి, యువశక్తే దేశాభివృద్ధికి పునాదని అన్నారు.