దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సూఫీ, ముస్లిం మత పెద్దలు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌ను కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో దేశంలో మత సామరస్యం, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశ సమగ్రతను కాపాడటంలో సూఫీ సంప్రదాయాల పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమావేశంలో మత పెద్దలు అజిత్ దోవల్‌ను శాలువాతో సత్కరించారు.