MNCL: ఈనెల 20న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ధూమ్ ధాం కళాకారుడు లింగంపల్లి రాజలింగం అన్నారు. ఇవాళ జన్నారం మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టి పాట పాడిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.