AP: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించి, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. సాంకేతిక ఆధారాలు, రికార్డులను కోర్టుకు సమర్పించాలని లీగల్ టీంకు సూచించారు. ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్ర హక్కులను కాపాడాలని స్పష్టం చేశారు.