WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయమాంత్రులకు గురి చేస్తున్నాయి. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. పెంకులు, రేకులు ధ్వంసం చేస్తూ ఇళ్లను గందరగోళం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపిన స్పందించడం లేదు. వెంటనే కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.