అన్నమయ్య: వైసీపీ MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి BJPలో చేరుతున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. లిక్కర్ స్కామ్ కేసులో గతేడాది 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. కేంద్రంలోని BJP అండ ఉంటేనే ఈ కేసుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.